![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -444 లో... కార్తీక్ ని పెళ్లి కొడుకుగా కాంచన రెడీ చేస్తుంది. దీపని సుమిత్ర రెడీ చేస్తుంది. దీపపై ఉన్న కోపాన్ని మళ్ళీ సుమిత్రకి గుర్తుచేస్తుంది జ్యోత్స్న. దాంతో దీపని అసహ్యించుకుంటుంది సుమిత్ర. దీపకి పూలు పెట్టు మమ్మీ అని సుమిత్రకి పూలు ఇస్తుంది జ్యోత్స్న. కానీ సుమిత్ర పూలు తీసి కిందపడేస్తుంది. దాంతో దీప బాధపడుతుంది. నీ తల్లి నిన్ను నా చావు కోసం కన్నట్లుంది అని సుమిత్ర అనగానే మా అమ్మని అలా అనకండి అని దీప ఏడుస్తుంది.
అప్పుడే దశరథ్ వస్తాడు. దీప కి దిష్టి తగిలేలా ఉంది.. దిష్టి తియ్ సుమిత్ర అని దశరథ్ అంటాడు. దీప బాధపడుతూ దశరథ్ ని హగ్ చేసుకొని నాన్న అంటూ ఏడుస్తుంది. ఏంటి అమ్మ.. మీ నాన్న గుర్తువచ్చాడా చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఉండరు అమ్మ.. మన చుట్టూ తిరుగుతారు అమ్మ అని దీపతో దశరథ్ అంటాడు.
ఆ తర్వాత నాన్న నువ్వు చాలా బాగున్నావని కార్తీక్ తో శౌర్య అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ ఇంటి ముందు ఇస్తున్న బిల్డప్ గురించి కాంచనకి చెప్తుంది శౌర్య. దాంతో కార్తీక్, కాంచన ఇద్దరు కలిసి శ్రీధర్ పై కోప్పడతారు. దీప దగ్గరికి అనసూయ వెళ్తుంది. సుమిత్ర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అనసూయ అనగానే.. సుమిత్ర కాళ్ళు దీప మొక్కబోతుంటే కాళ్ళని తాకనివ్వదు.
ఆ తర్వాత శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్న ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. పెళ్లిని ఎలా ఆపాలని డిస్కషన్ చేసుకుంటారు. తాళి బొట్టు కన్పించకుండా చేద్దామని శ్రీధర్ అంటాడు. అది పాతకాలం ఐడియా అని పారిజాతం అంటుంది. పాలల్లో మత్తు మందు కలుపుదామని పారిజాతం అంటుంది.. అది పాత ఐడియానే అని శ్రీధర్ అంటాడు. పెళ్లి టైమ్ కి శౌర్యని కిడ్నాప్ చెయ్యాలని జ్యోత్స్న అనగానే సూపర్ ఐడియా అని ఇద్దరు జ్యోత్స్నని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |